సౌతాడ్క గణపతి
సౌతాడ్క గణపతి క్షేత్రం దక్షిణ కన్నడ జిల్లాలోని బెలతంగడి
తాలూకా లో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే
గర్భ గుడి లేని గణపతి ని మనం ఇక్కడ చూస్తాం.
చుట్టూ పచ్చటి పొలాల మధ్యలో వెలసిన ఈ క్షేత్రం అతి రమణీయంగా ఉంటుంది. ప్రతి నిముషం స్వామిని ఇక్కడ మనం
దర్శించవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్యం
నుంచి 35 కి దూరంలో మరియు ధర్మస్థల నుంచి
16 కి మీ దూరంలో మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు.
ఇక్కడ
ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ తమ కోరికలు నెరవేరాలని మొక్కులు మొక్కి గంటలు కట్టడం.
తమ కోరిక తీరిన వెంటనే భక్తులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించి గంటలు కడతారు.
స్థల పురాణం
ప్రకారం మొదట ఒక రాజవంశీయులు గణపతి మందిరాన్ని నిర్మించి ఎంతో భక్తితో కొలిచేవారట.
అనతి కాలంలో శతృవులు గుడిని ధ్వంసం చేసారు.
కానీ గోవులను కాచే సమూహం గణపతి మూలవిరాట్టును తమతో తీసుకువెళ్లి ఒక కీరకాయ(దోసకాయ)
తోటలో ప్రతిష్టించారట . తర్వాత కాలంలో ఆ దోసకాయ రైతులు స్వామి విగ్రహాన్ని కనుగొని
భక్తితో నమస్కరించి ఆలయం నిర్మించాలని అనుకున్నారట కానీ స్వామి వారికి కలలో
సాక్త్శాత్కరించి తనను అలాగే వేదికమీదే ఉంచమని అదేసిన్చాడట. అప్పటినుంచి 24 / 7
స్వామి భక్తులకు అందుబాటులో ఉంటున్నారట.
ఇక్కడ స్వామికి
రకరకాల సేవలు నిర్వహిస్తుంటారు. అందులో చెప్పుకోదగ్గది “అవులక్కి పంచకజ్జాయ సేవ”.
ఇందులో అటుకులు, బెల్లము,నూగులు,కొబ్బరి, తేనె మరియు అరటిపండు కలిపి నైవేద్యంగా
సమర్పిస్తారు. కొంత భాగాన్ని ఇక్కడి గోశాలలోని గోవులకు సమర్పించి మిగిలినదాన్ని
ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ లడ్డు కుడా ప్రసాదంగా సమర్పిస్తారు.
కోరినదే తడవుగా
కోరికలు తీర్చే గణపతి సౌతాడ్క గణపతి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దర్శించాల్సిన
క్షేత్రం సౌతాడ్క గణపతి క్షేత్రం.
రండి మనం కుడా స్వామిని దర్శించుకుందాం....





No comments:
Post a Comment