“ గణానాం
త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాం ముప వస్త్రమస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణామ్ బ్రహ్మణాస్పద
ఆనశ్శ్రున్వనూతిభిహి సీద సాదనం”
విద్యా
కారకుడు, విఘ్నహర్త్ర, విఘ్నకర్త ఐన గణపతి
క్షేత్రములెన్నెన్నో ....
పూర్వం
ద్వాపరయుగాంతంనందు మహా ఋషులంతా బదరికాశ్రమం చేరి సూత పౌరాణికుని గాంచి యిట్లనిరి
“ఓ మహాత్మా కలియుగం ఆరంభమగుచున్నది . శ్రీ కృష్ణ పరమాత్మ కాలు తీసినంతనే కలి తన పాదం మోపనున్నాడు. కలి ప్రభావం నుండి
లోకాన్ని రక్షించేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని ప్రర్థించారు. అంత అచటనే నున్న
వాలఖిల్య మహర్షి మనమందరం కలిసి తపమొనరించిన ఉత్తమమని సెలవిచ్చెను. అంత అందరూ కలిసి
అలాగే చేయనారంభించారు. కానీ వారికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వెంటనే వాలఖిల్య మహర్షి
శ్రీ కృష్ణుని వేడుకున్నారు. అంతలో నారద
మహర్షి అచటికి వచ్చి వారిని గణపతి ఆరాధన
చేయవలసినదని చెప్పారు. అంత ఆ మునులు ఎక్కడ
అరాదిన్చాలో చెప్పమని కోరగా నారద మహర్షి దక్షిణాపథం గాలించి చివరగా
శరావతి నదీ తీరానికి ఎడమ ప్రక్కగా కొద్ది దూరంలోనున్న ఇప్పటి దక్షిణ కన్నడ జిల్లానందలి కుంజారణ్యం
చేరి తపస్సు చేయమని సెలవిచ్చారు. నారదులవారు
ఈ క్షేత్ర గొప్పదనాన్ని తెలుపుతూ త్రిమూర్తులు ఇచట యాగం చేసి అసురులను చంపారని
తెలిపారు. ఆ తర్వాతి కాలంలో ఈ యాగాశాలలు
కుండాలుగా మారాయి. వీటిని మనం చక్రతీర్థం,
బ్రహ్మతీర్థం పేరిట ఇప్పటికీ
దర్శించవచ్చు. మునులందరూ నారదుని విగ్రహప్రతిష్ట గావించాలని కోరగా
నారదులవారు శ్రీ గణపతిని మొక్కి దేవతీర్థంని
ఏర్పరచారు. ఆ తర్వాత నారదులవారు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను,
గణపతిని అచటికి ఆహ్వానించి వారికి తగు సేవలనోనార్చారు. అ తర్వాత విగ్రహ ప్రతిష్ట
గావించారు.ఈ గణపతి మూర్తిని విశ్వకర్మ చెక్కాడని ప్రతీతి. ఆ
తర్వాత వాలఖిల్య తదితర మునులెల్ల కుంజారణ్యం చేరి అచట గణపతిని ఆరాధించారు. పంచాకజ్జాయ, మోదకాది నైవేద్యాలతో గణపతిని సంతృప్తి
పరచారు. అప్పటినుండి గణపతి అచటే స్థిరంగా ఉండి భక్తులను కాపాడుతూ వస్తున్నారు.
కుంజనవన అనే ఇడగుంజి
గణపతి క్షేత్రం అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటి. ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు. ఇష్టార్థములను తీర్చే వరప్రదాయకుడు.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే
గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి. అంతే కాదు అన్నిచోట్ల గణపతి కడుపుకు నాగుపాము
చుట్టుకుని ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉంటారు. గణపతి
ఇచట ద్వి భుజాలతో ఉంటారు. ప్రపంచంలోనే ద్విభుజ గణపతి ఇదే. పురాణకథనం ప్రకారం
మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి.
అంటే ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట.
ఇప్పుడున్న
అలయంకూడా 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రతి సంవత్సరం 10 లక్షలమంది భక్తులు స్వామిని
దర్సిస్తారని అంచనా. ఇక్కడ స్వామిని గరికతో అర్చిస్తారు.
ద్విభుజ గణపతి అర్చన సర్వ శుభకరం. రండి మనం దర్శిద్దాం.





Nakutaliyaniganapathigurichitalusukuntunuverygoodteple
ReplyDeleteExlent
ReplyDelete