శిరః ఛేద గణపతి మందిరం

హిమాలయాలు ఎన్నో అద్భుతాలకు నిలయాలు. ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలు ...ఊహకందని చిత్ర విచిత్రాలు...ప్రతి ప్రదేశానికి ఒక పవిత్రత ...ఒక అమోఘమైన శక్తి....అందులో ఒకటి “సర్ కటా గణేష్”....రండి ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం ....
సనాతన ధర్మం ప్రకారం ఎటువంటి శుభ కార్యమైనా మొదలయ్యేది గణపతి పూజతోనే... సమస్త భారతావనిలో గణపతి ని గురించి తెలియని వారు ఉండరనేది నిస్సందేహం..గణపతి అనేక రూపాలలో కొన్ని:  సమ్మోహితులను గావించే బాలుడు లేదా మాతా-పితా యొక్క సేవలో సమర్పణ గావించిన యువకుడో లేదా జ్ఞానభండార  స్వరూపుడో మరి..గణేశ్ నామానికి అర్థం గణములకు ఈశ్వరుడని అర్థం..
శివ పురాణంలో వర్ణించిన విధంగా మనందరికీ తెలిసిన విషయం ఎలా ఆ మహాదేవుడు గణపతి మస్తకాన్ని ఖండించి తదుపరి అదే స్థానంలో గజ ముఖాన్ని అమర్చడం ...వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన లీల...మస్తకాన్ని ఖండించడమంటే అహంకారాన్ని ఖండించడమని అర్థం..ఇది మనకు ఎరుక పరచడానికే ఈ లీల మరి...గజం మదానికి చిహ్నం...మనలోని మదాన్ని అణచి పరమాత్మ వైపు  ప్రయాణిoప చేయడమే పరమార్థం మరి...
కేదారనాథ్ యాత్ర గౌరీ కుండ్  దగ్గరనుంచి మొదలౌతుంది ...ఇది అతి పవిత్ర ప్రదేశం...ఇక్కడే గౌరీ దేవి గణేశ ప్రతిమను చేసి ప్రాణం పోసి కాపలా ఉంచి తను స్నానానికి వెళుతుంది..అమ్మవారు స్నానం చేసిన కుండమే నేటి గౌరీ కుండ్ లోని తప్త్ కుండ్.. ఎన్నో అద్భుతాలకు నెలవు ఈ చోటు...మనం ఈ ప్రదేశం గురించి విడిగా సంపూర్తిగా వివరించుకుందాం..ఆ తర్వాత పరమేశ్వరుడు రావడం బాలుడు అడ్డగించడం..ఇద్దరి మధ్య వాద ప్రతివాదాల తర్వాత పరమేశ్వరుని ఆగ్రహానికి లోనయి బాలుడి శిరస్సు ఖండింపబడటం  జరిగిపోయాయి ఒకదాని వెనుక ఒకటిగా ...మరి ఆ ఖండించిన ప్రదేశమే ఈ గౌరీ కుండ్...ఈ గౌరీ కుండ్ కి కొద్ది దూరంలో “సర్ కటా గణేశ్ “ గా పిలువబడే గణేశ మందిరమ్ ఉంది ...అక్కడ తలలేని గణేశునికే పూజలు జరుగుతాయి...
రండి మనం కుడా ఆ పవిత్ర స్థలిని చూసి తరిద్దాం..





చూశారు కదా ఆ అద్భుత ఆలయాన్ని...మీరు కుడా హిమాలయ యాత్ర వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి మరి...ఇక్కడ మనకు ఇంకో అద్భుతమైన  విషయం కుడా కనపడుతుంది..పురాణాలలో వర్ణించిన ప్రకారం తల తెగిన గణేశుని మొండెం ఉత్తరాంచల్ లోని పాతాళ భువనేశ్వర మందిరంలో కుడా కనపడుతుంది. అనాది కాలం నుండి ఈ గుహ ఉందని ప్రతీతి. ఈ కలియుగంలో జగద్గురు శ్రీ ఆదిశంకరులు ఈ గుహను దర్శించి శాస్త్రోక్తంగా ఇచట పూజలు జరిగేల చేసారని అక్కడి వారు చెపుతారు..రండి మరి ఆ గుహను కుడా దర్శిద్దాం..\


హిమాలయాలలోని గణపతిని దర్శించం కదా.. ఇక అలాగే యాత్ర కొనసాగించుదాo రండి..







5 comments: